పార్వతీపురం రూరల్: ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దుల్లో సారా తయారీ, సుంకం చెల్లించని మద్యం అక్రమ రవాణా నియంత్రణపై ఇరు రాష్ట్రాల అధికారులు కొరాపుట్ ఎస్పీ కార్యాలయంలో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. కొరాపుట్ ఎస్పీ రోహిత్ వర్మ పర్యవేక్షణలో జరిగిన ఈ భేటీలో పార్వతీపురం మన్యం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి కె.సహదేవ నేతృత్వంలోని అధికారుల బృందం పాల్గొంది. సరిహద్దుల్లో ప్రతి నెలా సంయుక్త దాడులు నిర్వహించాలని, వేగవంతమైన సమాచార మార్పిడికి ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. నమోదైన కేసుల్లో నిందితుల ఆచూకీ గుర్తింపు, అరెస్టులకు పరస్పరం సహకరించుకోవాలని తీర్మానించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రకటించే ‘డ్రై డేస్’ సమయాల్లో మద్యం దుకాణాల మూసివేతను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు. భేటీలో అదనపు ఎస్పీ మనోజ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ పాఢి, అధికారులు సంతోష్ గోపాలకృష్ణ, నరసింహమూర్తి, శేఖర్‌బాబు, దాసు పాల్గొన్నారు.


