ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు | - | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు

Oct 29 2026 1:30 AM | Updated on Oct 29 2026 1:30 AM

● పోలింగ్‌ నవంబర్‌ 5న, ఓట్ల లెక్కింపు నవంబర్‌ 7న..

విజయనగరం రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను సవరించింది. ఎన్నికల నిర్వహణ తేదీల్లో మార్పులు చేసింది. సవరించిన ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం పోలింగ్‌ నవంబర్‌ 5 ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అవసరమైన చోట రీపోలింగ్‌ నవంబర్‌ 6న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఓట్ల లెక్కింపు నవంబర్‌ 7న ఉదయం 8 గంటల నుంచి జరగనుంది. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొంది.

నేడు విద్యాలయాలకు సెలవు

● అర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో కలెక్టర్‌ ప్రకటన

విజయనగరం అర్బన్‌: అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిఽధిలోని పాఠశాలలు, కళాశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు.

విద్యుదాఘాతంతో నల్లబిల్లి జేఎల్‌ఎం మృతి

వేపాడ: మండలంలోని నల్లబిల్లి సచివాలయంలో జేఎల్‌ఎంగా పనిచేస్తున్న దువ్వాడ పైడిరాజు (28) బుధవారం రాత్రి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసులు, వేపాడ విద్యుత్‌ శాఖ ఏఈ పిచ్చయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నల్లబిల్లి గ్రామానికి చెందిన పైడిరాజు అదే గ్రామ సచివాలయంలో జేఎల్‌ఎంగా పనిచేస్తున్నారు. గ్రామంలో విద్యుత్‌ బ్రేక్‌డౌన్‌ క్లియర్‌ చేసేందుకు నీలకంఠరాజుపురం ఎస్సీ కాలనీలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఏబీ స్విచ్‌ ఆపరేషన్‌ చేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందినట్లు చెప్పారు. మృతి చెందిన పైడిరాజుకు తండ్రి అప్పారావు, తల్లి చిన్నమ్మ ఉన్నారు. దీనిపై విద్యుత్‌శాఖ అధికారులు వల్లంపూడి స్టేషన్‌కు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి వల్లంపూడి ఎస్సై సుదర్శన్‌ చేరుకుని కేసు నమోదు చేశారు. పైడిరాజు ఇటీవల అయ్యప్ప దీక్షధారణ చేశారు. అందరితో మంచిగా ఉండే యువకుడి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement