● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ‘బెల్లాన’
చీపురుపల్లి: మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ ప్రభుత్వ పాలనకు స్థానిక సంస్థల ఎన్నికల్లో చెక్ చెప్పాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. చీపురుపల్లి మేజర్ పంచాయతీలోని అగ్రహారం, బ్రిడ్జిడౌన్ ఏరియా తదితర ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ నాయకులు ఇంటికొచ్చి అబద్ధపు మాటలు చెబితే నిలదీయాలన్నారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నా లేకపోయినా వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారన్నారు. ఎన్నికల తరువాత టీడీపీ నేతలు కనపించరని స్పష్టం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కొసిరెడ్డి రమణ, వెంపడాపు నీలకంఠం, తదితరులు పాల్గొన్నారు.


