రేగిడి: మండల పరిధిలోని అంబాడ వెంకటాపురం వద్ద మడ్డువలస ప్రధాన కుడికాలువకు గురువారం గండిపడింది. ప్రాజెక్టు నుంచి కాలువలోకి 750 క్యూసెక్కుల నీటిని అధికారులు విడిచిపెడుతున్నారు. గట్టు బలహీనంగా ఉండడంతో కోతకు గురై గండిపడింది. కాలువ నీరు పంట పొలాలమీదుగా ప్రవహించడంతో నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే కాలువలోకి నీటిని నిలుపుదల చేశారు. పంటలకు ఎటువంటి ఇబ్బందిలేకుండా ఉండేందుకు గండిని పూడ్చి పంటలకు సాగునీటిని అందజేస్తామని డీఈఈ నితిన్ తెలిపారు.
అంబాడ వెంకటాపురం వద్ద మడ్డువలస
కాలువకు పడిన గండి
పంట పొలాలపై నుంచి ప్రవహిస్తున్న కాలువ నీరు


