నామినేషన్ల జోరు | - | Sakshi
Sakshi News home page

నామినేషన్ల జోరు

Oct 23 2026 1:27 AM | Updated on Oct 23 2026 1:27 AM

విజయనగరం రూరల్‌: జిల్లాలో ప్రాదేశిక సమరానికి నామినేషన్ల పర్వం ఊపందుకుంది. రెండో రోజు గురువారం నామినేషన్‌ కేంద్రాలు అఽభ్యర్థులు, వారి మద్దతుదారులతో కిటకిటలాడాయి. జెడ్పీటీసీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు విజయనగరంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో తమ నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. నాయకులు, కార్యకర్తల తాకిడి భారీగా ఉండడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. గురువారం ఒక్కరోజే జిల్లాలోని 27 జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 97 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొదటిరోజు దాఖలైన 20 నామినేషన్లతో కలిపి ఆ సంఖ్య 117కు చేరింది. అలాగే, 443 ఎంపీటీసీ స్థానాలకు మొదటి రోజు 218, రెండో రోజు 1153 కలిపి 1371 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ అఽభ్యర్థులను బరిలోకిదించడంతో నామినేషన్‌ కేంద్రాల వద్ద ఎన్నికల సందడి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement