ఇకపై ఏటా చా.సో పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

ఇకపై ఏటా చా.సో పురస్కారాలు

Jul 6 2026 1:58 AM | Updated on Jul 6 2026 1:58 AM

ఇకపై ఏటా చా.సో పురస్కారాలు

అరసం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ బాధ్యతలు

ప్రముఖ రచయిత్రి చాగంటి తులసి

విజయనగరం టౌన్‌: తెలుగు సాహిత్యంలోనే ఒక మైలురాయిగా నిలిచిన చా.సో పురస్కారాలను 1997 నుంచి విజయనగరంలో అందజేస్తున్నామని ప్రముఖ రచయిత్రి చాగంటి తులసి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో తన స్వగృహంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఈ ఏడాది చా.సో పురస్కారాల విజేతలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాతికేళ్లుగా నిర్వహించిన సభ లు వయోభారంతో చేసే ఓపిక లేక నిలుపుదల చేశామన్నారు. అయితే ప్రస్తుతం అభ్యుదయ రచయిత ల సంఘం జిల్లాశాఖ ఆ బాధ్యతలను చేపట్టేందుకు ముందుకు రావడంతో ఇక ప్రతీ ఏటా తెలుగులో ఉత్తమ కథా రచయితకు చాసో కథా పురస్కారం, అనువాద రంగంలో విశేష కృషి చేసిన అనువాద రచయితకు చాగంటి తులసి అనువాద పురస్కారం ప్రకటిస్తామన్నారు. రెండు పురస్కారాలు తానే చా సో స్ఫూర్తి ద్వారా అందజేస్తానని, నిర్వహణ బాధ్యతలు మాత్రం అరసం జిల్లా శాఖ వహిస్తుందని స్పష్టం చేశారు. అయితే 2026 సంవత్సరానికి కళింగాంధ్ర పలుకుబడికి పట్టం కట్టిన ఉత్తమ కథా రచ యిత పార్వతీపురానికి చెందిన చింతా అప్పలనాయుడు రచించిన కథల సంపుటి ‘నకజనకరి...నాం..నాం...’ కథా సంపుటికి చాసో కథా పురస్కారం అందజేస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన కిలారి స్వర్ణ అనువాదం చేసిన ‘లిప్తకాల పు స్వప్నం’కి చాగంటి తులసి అనువాద పురస్కా రం ప్రకటిస్తున్నామన్నారు. ఆగస్టు 2న ఆదివారం జిల్లా కేంద్రంలో ఉదయం చాగంటి తులసి సాహితీ సమాలోచన కార్యక్రమం, మధ్యాహ్నం పురస్కారా ల ప్రదాన సభ ఉంటుందన్నారు. నగదు పురస్కా రంతో పాటూ జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తామన్నారు. తెలుగు సాహితీ ప్రియులంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో అరసం జిల్లా అధ్యక్షుడు జిఎస్‌.చలం, ప్రధాన కార్యదర్శి రత్నాల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement