విజయనగరం: అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తూ, వారి సంక్షేమం కోసం పాటుపడే వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే ప్రధాన బలమని ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. తండ్రికి తగ్గ తనయునిగా, మాట తప్పని, మడమ తిప్పని నేతగా రాజకీయాల్లో రాణిస్తున్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రెండేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజావ్యతిరేకత మొదలైందన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్‌కు చెందిన టీడీపీ మాజీ ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి రమేష్ నాయుడు, మాజీ యువజన విభాగం అధ్యక్షుడు పప్పల రాజు, మాజీ జాయింట్ సెక్రెటరీ బూరపు నాగరాజు, పలు కుటుంబాలు మాజీ కార్పొరేటర్ ఎన్ని లక్ష్మణరావు నేతృత్వంలో మంగళవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి కోలగట్ల వీరభద్రస్వామి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో నగర పరిధిలోని 62 డివిజన్‌లలో పోటీ చేయనున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నిండు మనస్సుతో ఆశీర్వదించి విజయపథంలో నడిపించాలన్నారు. 31వ డివిజన్‌కు చెందిన టీడీపీ మాజీ ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి రమేష్ నాయుడు మాట్లాడుతూ 35 ఏళ్లు పార్టీ కోసం కష్టపడి పని చేసినా తగిన గుర్తింపు లేదన్నారు. టీడీపీలో కష్టపడి పని చేసే కార్యకర్తలకు గుర్తింపు లేదని, కేవలం ఒక సామాజిక వర్గానికే నాయకత్వం వత్తాసు పలుకుతుందన్నారు. ఆ సామాజిక వర్గం ముందు సామాన్యులు నిలవలేరన్నారు. టీడీపీలో జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకుని వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు ఉపాధ్యక్షుడు అవనాపు లక్ష్మణరావు, పార్టీ నాయకులు బైక్ రమేష్, పిన్నింటి సూర్యనారాయణ, రెడ్డి గురుమూర్తి, కాళ్ల సూరిబాబు, బోడసింగి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల
వీరభద్రస్వామి
వైఎస్సార్‌సీపీలో చేరిన 31వ డివిజన్ టీడీపీ కార్యకర్తలు
పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన
కోలగట్ల


