వివాదాల పరిష్కారానికి శాశ్వత లోక్‌అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

వివాదాల పరిష్కారానికి శాశ్వత లోక్‌అదాలత్‌

Jul 1 2026 1:58 AM | Updated on Jul 1 2026 1:58 AM

విజయనగరం లీగల్‌:

శాశ్వత లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత పిలుపునిచ్చారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం శాశ్వత ప్రజాన్యాయ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా బబిత మాట్లాడుతూ శాశ్వత ప్రజాన్యాయ పీఠం అందించే సేవలను వివరించారు. బీమా, బ్యాంకింగ్‌, ఆర్థిక సంస్థలు, విద్య, విద్యాసంస్థలకు సంబంధించిన తగాదాలు, నివాసాలు, వాస్తవ ఆస్తికి సంబంధించిన సేవలు, ఉపాధి హామీ పథకం సంబంధించిన తగాదాలు, రోడ్డు, వాయు, జల రవాణా, పోస్టల్‌, టెలిఫోన్‌, టెలిగ్రాఫ్‌, విద్యుత్‌, కాంతి, నీటి సరఫరా, ప్రజారక్షణ, పారిశుద్ధ్యం, ఆస్పత్రి, నర్సింగ్‌హోం సేవల్లో తగాదాలను శాశ్వత లోక్‌ అదాలత్‌లో ఉచితంగా పరిష్కరించుకోవచ్చన్నారు. రెగ్యులర్‌ కోర్టులో కాకుండా శాశ్వత లోక్‌అదాలత్‌లో కేసులు త్వరితగతిన పరిష్కారమవుతాయన్నారు. కార్యక్రమంలో శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ దుర్గయ్య, మూడవ అదనపు న్యాయమూర్తి అప్పలస్వామి, నాల్గవ అదనపు న్యాయమూర్తి శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement