● 7200 లీటర్ల పులిసిన బెల్లం
ఊట ధ్వంసం
కురుపాం: నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఆంధ్ర–ఒడిశా ఎకై ్సజ్ శాఖ సిబ్బంది సంయుక్తంగా మంగళవారం దాడులు నిర్వహించినట్లు కురుపాం సర్కిల్ ఎకై ్సజ్‌శాఖ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకై ్సజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎ.సంతోష్ ఆధ్వర్యంలో ఒడిశా సరిహద్దులో రామన్నగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల రాష్ట్ర సరిహద్దు(కేదారిపురం –ఇందిరాకాలనీ సరిహద్దు)ల్లో సారా తయారీ స్థావరాలైన దాబాగూడ, ఇందిరాకాలనీ గ్రామాల్లో దాడులు నిర్వహించి సారా తయారీ కోసం సిద్ధంగా ఉంచిన 7200 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను గుర్తించి అధికారుల సమక్షంలో ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో అనిల్ శతపతి, సుశాంత్ శబరి, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ వీవీఎస్ శేఖర్‌బాబు, విజయనగరం ఎన్‌ఫోర్స్‌మెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ రమణ, సిబ్బంది పాల్తోన్నారు. సారా తయారీ రవాణా, అమ్మకాలు చేసే వారిపై ప్రజలు ఫోన్ 6302936599 నంబర్‌కు ఫిర్యాదు చేసి తెలియ జేయాలని ఈ సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.


