విజయనగరం జిల్లాలో 700 మంది వైద్యులు | - | Sakshi
Sakshi News home page

విజయనగరం జిల్లాలో 700 మంది వైద్యులు

Jul 1 2026 1:58 AM | Updated on Jul 1 2026 1:58 AM

వైద్యవృత్తి ఉన్నతమైనది

వైద్యవృత్తి ఎంతో ఉన్నతమైనది. ప్రజలు డాక్టర్‌ను గౌరవించాలి. వైద్యం కోసం వచ్చే వారితో ప్రేమగా, అప్యాయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని అవసరమైన వైద్యాన్ని వైద్యుడు అందించాలి. వైద్య వృత్తిని చేపట్టినందుకు అదృష్టంగా భావించాలి. ప్రతిరోగిని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి. – డాక్టర్‌ అల్లు పద్మజ,

సూపరింటెండెంట్‌, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి

సేవాభావం ఉండాలి

ఓపిక, సహనం ఉంటేనే వైద్య వృత్తిని చేపట్టాలి. సేవాదృక్పథంతో వైద్యసేవలు అందించాలి. సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వైద్యులు కృషి చేయాలి. ఆధునాతన వైద్య సేవలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. రోగులు వైద్యులను గౌరవించాలి.

– డాక్టర్‌ ఎస్‌.జీవనరాణి, డీఎంహెచ్‌ఓ

విజయనగరం ఫోర్ట్‌: జిల్లాలో 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ)లు, 18 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఉన్నాయి. అదేవిధంగా 300 వరకు ప్రైవేట్‌ ఆస్పత్రులు ఉన్నాయి. వాటిలో సుమారు 700 మంది వరకు వైద్యులు పనిచేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement