ఠిబ్రాయిలర్
లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్
శ్రీ155 శ్రీ280 శ్రీ290
చికెన్
● ఉద్యోగోన్నతి పొందిన ఎస్సైలకు ఎస్పీ దిశానిర్దేశం
విజయనగరం క్రైమ్: సీనియార్టీ ప్రాతిపదికన ఎస్సైలుగా పదోన్నతి పొందిన 8 మంది ఎస్పీ దామోదర్‌ను ఆయన చాంబర్‌లో మంగళవారం కలిశారు. పోలీసుశాఖలో సుమారు 35 ఏళ్లు పైబడి సర్వీస్‌లో ఉంటూ ఎస్సైలుగా ఉద్యోగోన్నతి పొందిన వారికి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. శాఖలో వస్తున్న మార్పులను గమనిస్తూ, సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. మారుతున్న నేరాలకు అనుగుణంగా చట్టాలపట్ల అవగాహన పెంచుకోవాలని, దర్యాప్తు మెలకువలను అందిపుచ్చుకోవాలని చెప్పారు. గతంలో పోలీసు శాఖలో రికార్డు వర్క్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఉండేదని, ప్రస్తుతం వాటి స్థానంలో కంప్యూటర్లు, సీసీటీఎన్‌ఎస్, సీసీ కెమెరాలు, డ్రోన్స్‌కు ప్రాధాన్యం పెరిగిందన్నారు. స్టేషన్, పోలీసు సిబ్బంది మేనేజ్‌మెంట్ పట్ల అవగాహన కలిగి, వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు పాల్గొని, ఉద్యోగోన్నతి పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.


