విజయనగరం క్రైమ్: గజపతినగరంలోని పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టి.తిరుపతిరావు భార్య దమయంతికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించారు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆమెకు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కానిస్టేబుల్ టి.తిరుపతిరావు కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం రెండు నెలల్లో ఆయన భార్య దమయంతికి పోలీసుశాఖలో టైపిస్ట్‌గా ఉద్యోగం కల్పించామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సౌమ్యలత, డీపీఓ ఏఓ పి. శ్రీనివాసరావు, జూనియర్ సహాయకురాలు చాముండేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.


