చికెన్
● ఉగాది వేడుకల్లో భాగంగా విద్యార్థినులకు ప్రశంసాపత్రాల అందజేత
విజయనగరం టౌన్: ఉగాది సందర్భంగా నగరంలోని రామనారాయణం వేదికగా జరిగిన భరతనాట్య ప్రదర్శన భక్తులు, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో వరలక్ష్మి నాట్యాలయం విద్యార్థినులు తమ అద్భుత కళా ప్రదర్శనతో అలరించారు. నాట్యాలయం గురువు పేరి వరలక్ష్మి పర్యవేక్షణలో విద్యార్థినులు ప్రదర్శించిన భరతనాట్య భంగిమలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రదర్శన అనంతరం ఆలయ నిర్వాహకులు కళాకారులను అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు. భారతీయ సంస్కతి, కళలను భావితరాలకు అందించడంలో ఇటువంటి ప్రదర్శనలు దోహదపడతాయని నిర్వాహకులు కొనియాడారు.
ప్రత్యేక ఆకర్షణగా లేజర్ షో..
నాట్య ప్రదర్శన అనంతరం ఆలయ ప్రాంగణంలోని భారీ ఆంజనేయ స్వామి విగ్రహంపై ఏర్పాటు చేసిన లేజర్ షో భక్తులను మంత్రముగ్ధులను చేసింది. కాంతి పుంజాల మధ్య స్వామివారి రూపం విద్యుత్ దీపాల వెలుగులో కాంతులీనుతూ భక్తి పారవశ్యాన్ని నింపింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, విద్యార్థినుల తల్లిదండ్రులు, భక్తులు పాల్గొన్నారు.


