చీపురుపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిను మాజీ ఎంపీ, పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్ తాడేపల్లిలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర బార్ కౌన్సిల్‌మెంబర్‌గా ఎన్నికై న తన సోదరుడు, న్యాయవాది బెల్లాన రవిని పరిచయం చేశారు. పుష్పగుచ్ఛం అందజేశారు.
బాధ్యతల స్వీకరణ
విజయనగరం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ఉత్తర్వుల మేరకు విజయనగరం నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ ఎం.రాంసుందర్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యమిస్తానన్నారు. నగర ప్రజలకు మౌలిక సదుపాయా లు, కనీస అవసరాలను సంపూర్ణగా కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల సంరక్షణ వంటి అత్యవసర సేవలు నిరంతరాయంగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని, వాటిని మరింత మెరగుపరిచే దిశగా కార్యాచరణ చేపడతాన్నారు. నగరపాలక సంస్థ అధికారులు, పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు మరిం మెరుగైన సేవలందించేలా కృషి చేయాలని సూచించారు.
శ్రీవారిని దర్శించుకున్న ఎన్నికల అధికారి
సీతంపేట: సీతంపేటలో టీటీడీ నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గురువారం ఉగాది పర్వదినాన దర్శించుకున్నారు. అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ పవార్ స్వప్నిల్‌తో కాసేపు ముచ్చటించారు.


