ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు గురువారం విడుదలైన గేట్ ఫలితాల్లో సత్తా చూపారు. ఉత్తమ ర్యాంకులు సాధించారు. జిల్లాకు, ఊరికి పేరుతెచ్చారు. ఉన్నత విద్యాభ్యాసానికి అర్హత సాధించారు.
వీరఘట్టం: మండలంలోని మొట్ట వెంకటాపురం గ్రామానికి చెందిన కుర్రోడు కందల రాజశేఖర్ గేట్ ఫలితాల్లో సత్తాచాటాడు. రెండు పేపర్లలో పరీక్షలు రాయగా ఆలిండియా స్థాయిలో ఈసీఈలో 735 స్కోర్ పాయింట్లతో 423వ ర్యాంకు, ఇనిస్ట్రిమెంటేషన్‌లో 275 స్కోర్ పాయింట్లతో 273వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు రాములమ్మ, రామారావు, సోదరుడు తిరుపతిరావు వ్యవసాయం చేస్తూ రాజశేఖర్‌ను చదివించారు. గేట్‌లో మంచి ర్యాంకు సాధించడంతో మురిసిపోతున్నారు.
గేట్‌లో మెరిసిన ఎం.వి.పురం కుర్రోడు


