అట్రాసిటి కేసుపై డీఎస్పీ విచారణ | - | Sakshi
Sakshi News home page

అట్రాసిటి కేసుపై డీఎస్పీ విచారణ

Apr 12 2025 2:08 AM | Updated on Apr 12 2025 2:08 AM

అట్రా

అట్రాసిటి కేసుపై డీఎస్పీ విచారణ

వేపాడ: మండలంలోని గుడివాడ గ్రామంలో అట్రాసిటి కేసుపై విజయనగరం డీటీసీ డీఎస్పీ పి.వీరకుమార్‌ శుక్రవారం విచారణ నిర్వహించారు. గ్రామానికి చెందిన జి.కృష్ణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లంపూడి ఎస్సై బి.దేవిపై నమోదైన కేసులో డీఎస్పీ గ్రామంలోని ఎస్సీ కాలనీలోను, పాన్‌షాపు వద్ద సాక్షులు, ఫిర్యాదుదారులను విచారణ చేసి వివరాలను నమోదు చేసుకున్నారు. డీఎస్పీతో పాటు ఎస్‌.కోట రూరల్‌ సీఐ అప్పలనాయుడు విచారణలో పాల్గొన్నారు.

ఆరు కేజీల గంజాయి స్వాధీనం

విజయనగరం క్రైమ్‌: స్థానిక రైల్వేస్టేషన్‌లో శుక్రవారం ఆరు కేజీల గంజాయి పట్టబడింది. ఒడిశా నుంచి ఓ వ్యక్తి ట్రైన్‌లో గంజాయితో వచ్చి స్టేషన్‌లో దిగాడన్న పక్కా సమాచారంతో వన్‌టౌన్‌ సీఐ శ్రీనివాస్‌, ఎస్సై రామ్‌గణేష్‌లు హుటాహుటిన స్టేషన్‌కు వెళ్లి రిజ్వరేషన్‌ కౌంటర్‌ పక్కనే ఉన్న పబ్లిక్‌ టాయిలెట్స్‌ వద్ద ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా, అనుగూరు పంచాయతీ పరిధి, లాటింగ్‌కు చెందిన 32 ఏళ్ల రమాకాంత్‌ బెహరాను అదుపులోకి తీసుకుని ఆ వ్యక్తి దగ్గర ఉన్న ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసునమోదు చేసి కోర్టులో హాజరు పరచడంతో న్యాయమూర్తి 14 రోజలు రిమాండ్‌ విధించినట్లు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.

870 లీటర్ల సారా పట్టివేత

నలుగురి అరెస్టు

సీతంపేట: మండలంలోని సుందరయ్యగూడ ప్రాంతంలో ఎకై ్సజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ ఏఈఎస్‌ ఏఎస్‌ దొర ఆధ్వర్యంలో సారా బట్టీలపై శుక్రవారం దాడులు చేశారు. ఈ సందర్భంగా 870 లీటర్ల సారా పట్టుకున్నారు. సారా వండడానికి సిద్ధం చేసిన 1250 లీటర్ల పులిసిన బెల్లం ఊటలు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు ఏఈఎస్‌ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి వూయక మురళి, బిడ్డిక ఆదినారాయణ, వి.సంజీవరావులతో పాటు నల్లబెల్లం సరఫరా చేసిన లబ్బకు చెందిన జాన్‌ సురేష్‌ను అ రెస్టు చేసినట్లు చెప్పారు. సారా వండినా, విక్రయించినా, అక్రమరవాణా చేసినా చర్యలు త ప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మొ బై ల్‌ పార్టీ టీమ్‌ మురళి, కొత్తూరు సీఐ కిరణ్మ యి, పాలకొండ ఎస్సైలు ఫణీంద్రబాబు, ఎల్‌ .తిరుపతిరావు, వాసుదేవరావు పాల్గొన్నారు.

ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్టు

రాజాం సిటీ: మండల పరిధి పొగిరి గ్రామ సమీపంలోని మామిడిచెట్టు కింద పేకాట ఆడుతున్న ఆరుగురిని శుక్రవారం అరెస్టు చేశామని ఎస్సై వై.రవికిరణ్‌ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు సిబ్బందితో దాడిచేసి పట్టుకున్నామని, వారి దగ్గర నుంచి రూ. 6140లు స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసినట్లు చెప్పారు.

మరో ఏడుగురు పేకాట రాయుళ్లు..

రాజాం సిటీ: స్థానిక శ్రీకాకుళం రోడ్డులోని అమృత ఆస్పత్రి ఎదురుగా ఉన్న స్థలంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని శుక్రవారం అరెస్టు చేశామని సీఐ కె.అశోక్‌కుమార్‌ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ఎస్సై వై.రవికిరణ్‌తో పాటు సిబ్బంది దాడిచేసి పట్టుకున్నారన్నారు. ఈ దాడిలో పేకాటరా యుళ్ల నుంచి రూ.62,430లుతోపాటు ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల నియామకం

పార్వతీపురంటౌన్‌: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలను నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశామేరకు శుక్రవారం పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన నలుగురిని కమిటీలో నియమించారు. వివరాలిలా..

అట్రాసిటి కేసుపై డీఎస్పీ విచారణ1
1/2

అట్రాసిటి కేసుపై డీఎస్పీ విచారణ

అట్రాసిటి కేసుపై డీఎస్పీ విచారణ2
2/2

అట్రాసిటి కేసుపై డీఎస్పీ విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement