సాయిరాం క్యాటరింగ్ సంస్థలో
30 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
మహారాణిపేట: గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారన్న సమాచారంతో పౌరసరఫరాల శాఖ అధికారులు మంగళవారం మాధవధారలోని గుంటూరి వారి సాయిరాం క్యాటరింగ్ సంస్థపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి భాస్కర్ ఆదేశాలతో తనిఖీలు చేపట్టిన అధికారులు.. అక్కడ 30 గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించినందుకు సంస్థపై 6ఎ కేసు నమోదు చేసినట్లు డీఎస్‌ఓ వి.భాస్కరరావు తెలిపారు.


