పట్టపగలే చోరీకి యత్నం | - | Sakshi
Sakshi News home page

పట్టపగలే చోరీకి యత్నం

Nov 18 2026 1:26 AM | Updated on Nov 18 2026 1:26 AM

ముగ్గురు నిందితులను పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత వారి వద్ద మత్తు కలిగించే పదార్థాలు, సిరంజ్‌లు స్వాధీనం!

మధురవాడ: ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించిన ముగ్గురు యువకులను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విశాఖ పరిధిలోని మారికవలసలో మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పీఎం పాలెం క్రైం సీఐ సూర్యప్రకాష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మారికవలసకు చెందిన గరికిన సత్యవతి ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించిన ముగ్గురు యువకులు చోరీకి పథకం వేశారు. ఆరిలోవకు చెందిన వై.సుశాంత్‌ (19), ఎంవీపీ కాలనీకి చెందిన ఎ.సాయి సూర్య (18), మహారాణిపేటకు చెందిన వి.యశ్వంత్‌ (18) కలిసి ముందు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించారు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారణకు వచ్చి ఇద్దరు ఇంటి బయట కాపలాగా ఉండగా.. మరొకరు లోపలికి ప్రవేశించి రూ.3,500 నగదు, వెండి పట్టీలు, బంగారు ఆభరణాలను చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో దొంగలను గుర్తించిన సత్యవతి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే ముగ్గురినీ పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని అప్పగించారు. నిందితులు ముగ్గురూ పాత నేరస్తులేనని, వీరిపై ఎంవీపీ, ఆరిలోవ, త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి చోరీ సొత్తుతో పాటు మత్తు కలిగించే పదార్థాలు, సిరంజ్‌లు స్వాధీనం చేసుకున్నారు. అవి డ్రగ్స్‌ కాదని పోలీసులు స్పష్టం చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement