కొమ్మాది: నగరానికి చెందిన దర్శకుడు అజ్గర్ ఆలీ రూపొందించిన నాలుగు షార్ట్ ఫిల్మ్స్, ఓ మ్యూజిక్ వీడియోకు పూరి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పలు అవార్డులు లభించాయి. ఆయన రూపొందించిన ‘5 స్టార్స్’షార్ట్ ఫిల్మ్‌కు బెస్ట్ తెలుగు ఫిల్మ్, బెస్ట్ షార్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫిల్మ్ మేకర్ తదితర అవార్డులు దక్కాయి. ‘పెండింగ్’చిత్రానికి బెస్ట్ ఫిల్మ్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డు లభించింది. ‘డిపార్చర్’, ‘ది ఫాల్’షార్ట్ ఫిల్మ్స్‌కు వరుసగా బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అవార్డులు ప్రకటించారు. వెన్నెల రచించిన ‘మౌనం’మ్యూజిక్ వీడియోకు బెస్ట్ మ్యూజికల్ తెలుగు ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ యాక్టర్ (మేల్, ఫిమేల్) విభాగాల్లో అవార్డులు లభించినట్లు అజ్గర్ ఆలీ ఓ ప్రకటనలో తెలిపారు.


