● అభిమాన ముద్దు..ఆత్మీయ కౌగిలి | - | Sakshi
Sakshi News home page

● అభిమాన ముద్దు..ఆత్మీయ కౌగిలి

Oct 30 2026 7:42 AM | Updated on Oct 30 2026 7:42 AM

● మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణి ప్రచారానికి బ్రహ్మరథం ● ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలు కురసాల కన్నబాబు, కేకే రాజు, అమర్‌నాథ్‌

ఎన్నికల ప్రచారం అంటే కేవలం ఓట్ల అభ్యర్థనలు, నినాదాలు, మైకుల హోరు మాత్రమే కాదు.. ప్రజలతో నాయకులకు ఉండే ప్రేమానురాగాలకు అద్దం పట్టే వేదిక కూడా.. జీవీఎంసీ మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణి చేపట్టిన ప్రచార పర్వంలో సరిగ్గా అలాంటి ఒక అరుదైన, కంటికి ఇంపైన దృశ్యం విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద ఆవిష్కృతమైంది. ప్రచారంలో భాగంగా మత్స్యకార కుటుంబాలను పలకరిస్తూ ముందుకెళ్తున్న వరుదు కల్యాణికి ఒక వృద్ధురాలు ఎదురైంది. ముడతలు పడిన ఆ చేతులు, అనుభవాల సముద్రమైన ఆ కళ్లు.. ప్రజాప్రతినిధిగా వస్తున్న కల్యాణిని చూడగానే అమితమైన వాత్సల్యంతో నిండిపోయాయి. ఏమాత్రం సంకోచించకుండా ఆ అవ్వ కల్యాణిని దగ్గరకు తీసి, చెంపపై ముద్దుపెడుతూ గుండెలకు హత్తుకుంది. ఆ ఆత్మీయ స్పర్శకు వరుదు కల్యాణి మురిసిపోతూ, చిరునవ్వుతో ఆ వృద్ధురాలిని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఓ అమ్మ ఇచ్చిన దివ్యదీవెనగా దీనిని భావిస్తున్నానని వరుదు కల్యాణి స్పందించారు. – ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్‌, విశాఖ

● అడుగడుగునా అదే ఆదరణ

సాక్షి, విశాఖపట్నం: అడుగడుగునా ప్రజాభిమానం.. యువత, మహిళలు, వృద్ధుల నుంచి ఒకే తరహా స్పందన.. కుంకుమదిద్ది ఆహ్వానాలు.. వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణి ఎన్నికల ప్రచారానికి ఆదివారం విశేష ఆదరణ లభించింది. ఆమె ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వాగతం పలికారు.ఉదయం 6 గంటలకు ఫిషింగ్‌ హార్బర్‌లో ప్రారంభమైన ప్రచారం రోజంతా కొనసాగింది. తొలుత డాల్ఫిన్‌ హోటల్‌ సమీపంలోని పంత్‌ భవన్‌ జైన్‌ టెంపుల్‌ను సందర్శించిన వరుదు కళ్యాణి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఉత్తర నియోజకవర్గంలోని 48, 65వ వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రీజినల్‌ కోఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు, జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో కలిసి పాల్గొన్నారు. పెందుర్తి మండలంలోని 116వ వార్డులో జరిగిన ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, పార్లమెంట్‌ పరిశీలకుడు శరగడం చిన్న అప్పలనాయుడు తదితరులతో కలిసి ఆమె ప్రచారం చేశారు.

మత్స్యకారుల ఆత్మీయ స్వాగతం

ఫిషింగ్‌ హార్బర్‌లో వరుదు కల్యాణికి మత్స్యకారులు ఘన స్వాగతం పలికారు. వ్యాపారులు, స్థానికులతో ఆప్యాయంగా మాట్లాడిన ఆమె వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్‌సీపీని గెలిపిస్తే ఫిషింగ్‌ హార్బర్‌లో వ్యాపారం చేసుకునే వారికి స్టాళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌, సినీ నటుడు జోగినాయుడు, 33వ వార్డు అభ్యర్థి చెన్నా శైలజ, 30వ వార్డు అభ్యర్థి వేణు, మత్స్యకార విభాగం అధ్యక్షుడు పేర్ల విజయచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement