ఏయూ క్యాంపస్: ఇస్కాన్ విశాఖ నగర శాఖ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన భారీ యాంత్రిక ఏనుగు ‘రంగ’ను బీచ్‌రోడ్డులోని ఎంజీఎం వరల్డ్ ప్రాంగణంలో ఆదివారం ఆవిష్కరించారు. ఇస్కాన్ అధ్యక్షుడు సాంబదాసు ప్రభూజీ, మాతాజీ నితాయ్ సేవిని సమక్షంలో 800 కిలోల బరువున్న ఈ నడిచే ఏనుగును ఇస్కాన్ అంతర్జాతీయ చైర్మన్ మధు సేవిత జ్యోతి ప్రజ్వలన చేసి ఆవిష్కరించారు. అనంతరం ప్రాంగణంలో నిర్వహించిన భజన క్లబ్బింగ్, కార్తీక దీపోత్సవం, హరే కృష్ణ మహామంత్ర సంకీర్తనలు భక్తులను అలరించాయి. కార్యక్రమంలో సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, ఏయూ పూర్వ ఉపకులపతి జీఎస్‌ఎన్ రాజు, సింహాచలం దేవస్థానం ప్రధాన అర్చకుడు శ్రీనివాసాచార్యులు, పైడా విద్యాసంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్, ఆధ్యాత్మికవేత్త ఎం.వి.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఎంజీఎం వరల్డ్ ప్రాంగణంలో
ఆవిష్కరించిన
భారీ యాంత్రిక ఏనుగు


