స్మార్ట్‌ బస్‌ షెల్టర్లు.. మారిన రూపురేఖలు | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ బస్‌ షెల్టర్లు.. మారిన రూపురేఖలు

Oct 27 2026 1:14 AM | Updated on Oct 27 2026 1:14 AM

● వైఎస్సార్‌సీపీ హయాంలో వెలుగొందిన విశాఖ ● ప్రతి ప్రధాన జంక్షన్లలో బస్‌ షెల్టర్లను అభివృద్ధి చేసిన గత ప్రభుత్వం ● బస్‌ బేలతో ప్రజలకు ఎండ, వానల నుంచి ఉపశమనం

సాక్షి, విశాఖపట్నం: సిటీ ఆఫ్‌ డెస్టినీ..విశ్వ నగరం.. ఇలాంటి పేర్లతో పిలిచి మురిసిపోవడమే తప్ప, మహా విశాఖ వంటి నగరంలో ఒకప్పుడు ప్రయాణికులు బస్సు కోసం వేచి చూడాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఉండేది. సరైన బస్టాండ్లు లేక, ఎండలు మండిపోయినా, వానలు దంచికొట్టినా రోడ్ల మీదే పడిగాపులు కాసేవారు. ఈ కష్టాలకు చరమగీతం పాడుతూ, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నగర ముఖచిత్రాన్ని మార్చేలా ప్రధాన కూడళ్లలోని బస్టాండ్లను అద్భుతంగా అభివృద్ధి చేసింది. ‘ఇది కదా నిజమైన అభివృద్ధి’ అని నగరవాసులు సగర్వంగా చెప్పుకునేలా అత్యాధునిక బస్‌ బేలను అందుబాటులోకి తెచ్చి ప్రయాణికులకు వాతావరణ ఇబ్బందుల నుంచి గొప్ప ఉపశమనం కలిగించింది.

జీవీఎంసీ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా, వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రధాన కూడళ్లలో మొత్తం 20 మోడ్రన్‌ బస్‌ షెల్టర్లను నిర్మించారు. ఇందుకోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ. 4.64 కోట్లు వెచ్చించింది. జీ–20 సదస్సు సమయంలో ఆంధ్రా యూనివర్సిటీ చిన వాల్తేరు రోడ్డు వద్ద రూ. 25 లక్షలతో నిర్మించిన మోడల్‌ బస్‌స్టాప్‌ నమూనా ఆధారంగా వీటిని తీర్చిదిద్దారు. గురుద్వారా జంక్షన్‌, ఆర్కే బీచ్‌, జగదాంబ, మద్దిలపాలెం, ఎన్‌ఏడీ, వెంకోజీపాలెం, అక్కయ్యపాలెం, కంచరపాలెం, ఎండాడ, ఆర్టీసీ కాంప్లెక్స్‌ వంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఈ షెల్టర్లను విస్తరించి ప్రజలకు రవాణా సౌలభ్యాన్ని కల్పించారు. ఈ అత్యాధునిక స్మార్ట్‌ బస్‌ షెల్టర్లు విశాఖకు సరికొత్త ‘స్మార్ట్‌ సిటీ’ లుక్‌ను తీసుకొచ్చాయి. ఆకర్షణీయమైన మోడ్రన్‌ డిజైన్‌, మన్నికై న గ్రానైట్‌ ఫ్లోరింగ్‌, రాత్రివేళల్లో వెలుగులు పంచే ఎల్‌ఈడీ లైటింగ్‌, ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన కూర్చునే ఏర్పాట్లతో వీటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా, కొన్ని చోట్ల ప్రయాణికుల సౌకర్యార్థం కియోస్క్‌లు, టాయిలెట్లు, ఇతర కనెక్టివిటీ వసతులను సైతం ఏర్పాటు చేసేలా ప్రణాళికలు చేశారు. తర్వాత ప్రభుత్వం మారడంతో వీటి గురించి చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. ఏదేమైనా.. ఈ స్మార్ట్‌ బస్‌ షెల్టర్లతో విశాఖ ప్రజల నిరీక్షణ కష్టాలు తీరడమే కాకుండా, నగర మౌలిక సదుపాయాల కల్పనలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కృషి స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement