మృత్యువుతో పోరాడి మృతి చెందిన వాచ్‌మన్‌ | - | Sakshi
Sakshi News home page

మృత్యువుతో పోరాడి మృతి చెందిన వాచ్‌మన్‌

Oct 27 2026 1:14 AM | Updated on Oct 27 2026 1:14 AM

పెందుర్తి: మండలంలోని సౌభాగ్యరాయపురం లక్కీ రిసార్ట్‌లో గంజాయి, మద్యం మత్తులో ఉన్న యువకుల దాడిలో తీవ్రంగా గాయపడిన వాచ్‌మన్‌ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దాదాపు రెండు నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరికి కన్నుమూశాడు. వివరాలివి.. గత నెల 1న నగరానికి చెందిన ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ పుట్టినరోజు కోసం రిసార్ట్‌ బుక్‌ చేసింది. ఆ రోజు రాత్రంతా దాదాపు 15 మంది యువతీ యువకులు పెద్ద ఎత్తున గంజాయి, మద్యం సేవించారు. ఈ క్రమంలో రిసార్ట్‌లో గొడవ జరగడంతో రిసార్ట్‌ వాచ్‌మెన్‌, ఎస్‌ఆర్‌ పురం వాసి బమ్మిడి పైడయ్య(70) అడ్డుకునే ప్రయత్నం చేశాడు. మత్తులో ఉన్న సదరు యువకులు పైడయ్యపై బీరు బాటిళ్లు, మద్యం సీసాలతో విచక్షణారహితంగా దాడి చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement