హైటెక్‌‘రంగా’.. వైభవంగా.. | - | Sakshi
Sakshi News home page

హైటెక్‌‘రంగా’.. వైభవంగా..

Oct 27 2026 1:14 AM | Updated on Oct 27 2026 1:14 AM

ఇస్కాన్‌లో ఆకట్టుకుంటున్న

యాంత్రిక ఏనుగు రంగా

కొమ్మాది: ప్రముఖ ఆధ్యా త్మిక కేంద్రం ఇస్కాన్‌ ఆలయం సరికొత్త సాంకేతికతకు వేదికై ంది. ఆలయాల్లో రద్దీ, బాణసంచా శబ్దాలు, గొలుసుల బంధనాల వల్ల సజీవ ఏను గులు తీవ్రమైన మానసిక, శారీరక వేదనకు గురవుతుంటాయి. దీనిని ఒకరకమైన జీవహింసగా భావించిన ఇస్కాన్‌ యాజమాన్యం.. మూగజీవాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే అచ్చం నిజమైన ఏనుగును తలపించేలా తయారు చేయించిన ఒక అద్భుతమైన రోబోటిక్‌ ఏనుగును ఆలయానికి తీసుకువచ్చింది. అదే ‘రంగా’! కేరళలోని త్రిసూర్‌ ప్రాంతం నుంచి ఈ యాంత్రిక అద్భుతాన్ని ప్రత్యేకంగా సాగర్‌నగర్‌ ఇస్కాన్‌కు తీసుకువచ్చారు.

ఈ రోబోటిక్‌ ఏనుగు నిజమైన ఏనుగు రూపాన్ని, కదలికలను అచ్చం అలాగే ప్రతిబింబించేలా ప్రత్యేకంగా రూపొందించారు. సుమారు 10 అడుగుల ఎత్తు, 800 కిలోల బరువు ఉంటుంది. దీనిలో 5 అత్యాధునిక ఎలక్ట్రిక్‌ మోటార్లు అమర్చారు. దీని సహాయంతో చెవులు ఆడించడం, తల ఊపడం, కళ్లు మూసి తెరవడం, తొండం పైకెత్తి నీరు జల్లడం, భక్తులను దీవించడం వంటి సహజ కదలికలను ప్రదర్శిస్తుంది. అడుగున చక్రాల ఫ్లాట్‌ఫామ్‌ను అమర్చడం వల్ల ఉత్సవాల్లో ఇది సులభంగా ముందుకు కదులుతుందని ఇస్కాన్‌ అధ్యక్షుడు సాంబాదాస్‌ ప్రభూజీ, మాతాజీ నితాయి సేవిని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement