న్యాయం చేయలేదని ఎన్నికల బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

న్యాయం చేయలేదని ఎన్నికల బహిష్కరణ

Oct 27 2026 1:14 AM | Updated on Oct 27 2026 1:14 AM

ఎల్‌జీ పాలిమర్స్‌ బాధితుల ఆవేదన

గోపాలపట్నం: ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన బాధితులకు తగిన న్యాయం చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపిస్తూ వెంకటాపురం ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి కూడా తమ సమస్యలను పీజీఆర్‌ఎస్‌ ద్వారా అధికారులు, నాయకులు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. తమ సమస్యలను పరిష్కరిస్తామని నమ్మకమైన హామీ ఇచ్చిన వారికే ఓటు వేస్తామని, లేనిపక్షంలో ఎవరికీ ఓటు వేయబోమని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement