మన్సూరాబాద్: తాను మరణిస్తూ ఐదుగురికి కొత్త జీవితాలను ప్రసాదించాడు ఓ డ్రైవర్. జీవన్‌దాన్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం తాటిచెట్లపాలెంలోని వైఎస్సార్ నగర్‌కు చెందిన సతివాడ చిన్నారావు (42) కుటుంబంతో కలిసి బాలాపూర్ బొడకుంటలో నివాసముంటున్నాడు. ఈ నెల 14న హెయిర్‌కటింగ్ చేయించుకుని ఇంటికి వస్తుండగా రోడ్డుపై పడిపోయాడు. రెండు రోజులుగా తలనొప్పి, వాంతులతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నెల 25న చిన్నారావు బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో జీవన్‌దాన్ ప్రతినిధులు అతడి భార్య మధుకు అవయవదానంపై అవగాహన కల్పించారు. ఆమె అంగీకారంతో చిన్నారావు నుంచి రెండు కిడ్నీలు, కాలేయం, రెండు కార్నియాలను సేకరించారు. వీటి ద్వారా ఐదుగురికి ప్రయోజనం చేకూరనుంది.


