తుపాను వేళ అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

తుపాను వేళ అప్రమత్తంగా ఉండాలి

Oct 27 2026 12:56 AM | Updated on Oct 27 2026 12:56 AM

అల్లిపురం: తుపాను నేపథ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నగరంలోని లోతట్టు, కొండవాలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ సూచించారు. వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా కాలువలు, డ్రైనేజీలను శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సోమవారం ప్రకటనలో తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున బీచ్‌లకు వెళ్లవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. విద్యుత్‌ స్తంభాలు, హోర్డింగులు, చెట్లు, శిథిల భవనాలకు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం జీవీఎంసీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 4250 0009, వాట్సాప్‌ నంబర్‌ 9014218870ను సంప్రదించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement