తుపానుపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

తుపానుపై అప్రమత్తం

Oct 27 2026 12:56 AM | Updated on Oct 27 2026 12:56 AM

● తీరప్రాంత గ్రామాలు, కొండవాలు ● అత్యవసరమైతేనే బయటకు రావాలి ● కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌

ప్రాంతాలపై ప్రత్యేక నిఘా

బీచ్‌రోడ్డు: తుపాను ముప్పు నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టిందని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. తీరప్రాంత గ్రామాలు, కొండవాలు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను తరలించేందుకు సహాయ శిబిరాలు, నిత్యావసర సరుకులు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. మత్స్యకారులను అప్రమత్తం చేశామని, డ్రైనేజీలు పొంగిపొర్లకుండా, వర్షాల వల్ల రహదారులపై ఏర్పడే అడ్డంకులను తొలగించేందుకు అదనపు యంత్రాలను అందుబాటులో ఉంచామని వివరించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లాలో ఒక ఎన్డీఆర్‌ఎఫ్‌, ఒక ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్‌లను అప్రమత్తం చేశామని, రాష్ట్రవ్యాప్తంగా మరో 10 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, దేశవ్యాప్తంగా అదనంగా 16 బృందాలు సహాయానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. గర్భిణులను గుర్తించి, ప్రసవ తేదీ సమీపించిన వారిని అవసరాన్ని బట్టి ముందుగానే ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టరేట్‌, జీవీఎంసీ సిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌తో పాటు జోనల్‌, మండల స్థాయిల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని, అగ్నిమాపక, పోలీసు శాఖలను అవసరమైన సిబ్బంది, యంత్రాలతో సిద్ధం చేశామని వివరించారు.

మూడు రోజులూ అప్రమత్తంగా ఉండాలి

వాతావరణ అంచనాల ప్రకారం ఈనెల 27న భారీ, 28న అతిభారీ, 29న మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్‌ తెలిపారు. తీరప్రాంత, కొండవాలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరాన్ని బట్టి సహాయ శిబిరాలకు తరలివెళ్లాలని సూచించారు. బీచ్‌లు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement