అర్నాబ్‌పై అలర్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అర్నాబ్‌పై అలర్ట్‌

Oct 27 2026 12:56 AM | Updated on Oct 27 2026 12:56 AM

అర్నాబ్‌ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండబోతోందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో గంగపుత్రుల్లో అలజడి మొదలైంది. సంద్రంలోకి వెళ్లి వేటాడితేనే పూట గడిచే మత్స్యకారులు.. వేట ముగించుకుని ఉరుకులు పరుగులతో తీరానికి చేరుకున్నారు. తుపాన్‌ ప్రభావం మొదలవకముందే చేపల బోట్లను హార్బర్‌లో లంగరు వేసి భద్రపరిచారు. గంటకు 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో బోట్లు ఎక్కడ దెబ్బతింటాయోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, మూడు రోజుల పాటు తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న సమాచారంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. పెట్రోల్‌ బంకుల వద్ద బారులు దీరారు. మూడు రోజుల పాటు బయటకు వెళ్లలేని పరిస్థితులు ఎదురైతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించి, ముందుగానే నిత్యావసర సరుకులను సమకూర్చుకుంటున్నారు.

– ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్‌,

విశాఖపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement