సాక్షి, విశాఖపట్నం: ఉత్తర నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం సందడిగా సాగింది. 62, 63, 64వ వార్డుల్లో వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 62వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పర్వీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో వారిద్దరూ పాల్గొన్నారు. శివనగర్‌లోని దుర్గాలమ్మ, బంగారమ్మ ఆలయాల్లో పూజలు నిర్వహించి, అనంతరం శివనగర్, హర్షనగర్, గ్రీన్ గార్డెన్స్, హుస్సేన్ నగర్, సాయినగర్ ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. అలాగే 63వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి గుజ్జు శ్రీదేవి ఆధ్వర్యంలో, 64వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి రెయ్యి వెంకట రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో మేయర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, కేకే రాజు పాల్గొన్నారు.
కళింగ ఆత్మీయ సమావేశం : మాధవధారలోని కల్యాణ్ ఫంక్షన్ హాల్‌లో కళింగ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి పాల్గొన్నారు. 60వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పాతిన సారంగధరుడు, 61వ వార్డు అభ్యర్థి మెట్ట దమయంతి, 52వ వార్డు అభ్యర్థి సాడి పద్మరెడ్డికి మద్దతుగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్, సీనియర్ నాయకులు పైడి శ్రీను, బాగాతి విజయ్, తిరుమలరావు, నంబాల రాజేష్, నంబాల ఈశ్వరరావు, పి.సునీత, సీపాన రాము, పేడాడ నరసింగరావు, కూర్మరావు, బొడ్డేపల్లి నరసింగరావు, పొన్నాడ అప్పారావు మాస్టర్, కళింగ కుటుంబ సభ్యులుపాల్గొన్నారు.
‘రాజస్థాని సమాజ్’ ఆత్మీయ సమావేశం: జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా పరిషత్ కార్యాలయం సమీపంలోని రాజస్థాని సమాజ్ భవనంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కేకే రాజుతో పాటు మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి పాల్గొన్నారు.


