పోలింగ్‌ పర్యవేక్షణకు సీవోసీ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ పర్యవేక్షణకు సీవోసీ పరిశీలన

Oct 24 2026 9:50 AM | Updated on Oct 24 2026 9:50 AM

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ రెండో సాధారణ ఎన్నికలు–2026 పోలింగ్‌ ప్రక్రియ పర్యవేక్షణకు సిటీ ఆపరేషన్‌ సెంటర్‌ (సీవోసీ)లో చేసిన ఏర్పాట్లను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిశోర్‌ శుక్రవారం పరిశీలించారు. జీవీఎంసీ కమిషనర్‌, అదనపు ఎన్నికల అధికారి కేతన్‌ గార్గ్‌, అదనపు కమిషనర్‌ ఎస్‌.ఎస్‌. వర్మ పాల్గొన్నారు. పోలింగ్‌ కేంద్రాల నుంచి సమాచారం సేకరణ, వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్‌ శాతం వివరాలు సేకరించి నివేదికలు రూపొందించాలని కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ సూచించారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలు, సోషల్‌ మీడియా పోస్టులపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement