టీడీపీకి వరుస షాక్‌లు! | - | Sakshi
Sakshi News home page

టీడీపీకి వరుస షాక్‌లు!

Oct 24 2026 9:50 AM | Updated on Oct 24 2026 9:50 AM

వైఎస్సార్‌సీపీలోకి కాపు నేత

బంటుపల్లి సూర్యనారాయణ

కండువా కప్పి ఆహ్వానించిన

మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌

పరవాడలో 200 మంది అనుచరులతో టీడీపీ నేతల చేరిక

అల్లిపురం: జీవీఎంసీ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీకి చెందిన కీలక నేతలు వైఎస్సార్‌సీపీ వైపు అడుగులు వేస్తున్నారు. కూటమి పాలనపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత.. వైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ఆదరణే.. ఈ రాజకీయ పరిణామాలకు కారణమని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. తాజాగా జీవీఎంసీ 40వ వార్డు టీడీపీ మాజీ అధ్యక్షుడు, కాపు నేత బంటుపల్లి సూర్యనారాయణ వైఎస్సార్‌సీపీలో చేరగా.. పరవాడలో టీడీపీకి చెందిన ముగ్గురు నాయకులు సుమారు 200 మంది అనుచరులతో పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఎన్నికల వేళ చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపుతుండగా.. వైఎస్సార్‌సీపీ శిబిరంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

40వ వార్డులో కాపు నేత చేరిక : జీవీఎంసీ 40వ వార్డు టీడీపీ మాజీ అధ్యక్షుడు, కాపు నేత బంటుపల్లి సూర్యనారాయణ శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. దక్షిణ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. 40వ వార్డులో బలమైన కాపు నేతగా గుర్తింపు పొందిన సూర్యనారాయణ చేరికతో వైఎస్సార్‌సీపీకి మరింత బలం చేకూరుతుందని వాసుపల్లి పేర్కొన్నారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచే ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. వార్డు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ముత్తబత్తుల రమేష్‌, కార్పొరేటర్‌ అభ్యర్థి బోరా విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ చేరిక జరిగింది. వాసుపల్లి నాయకత్వ లక్షణాలు, నిస్వార్థ ప్రజాసేవ తనను ఆకట్టుకున్నాయని సూర్యనారాయణ తెలిపారు. వైఎస్సార్‌సీపీ విజయానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

పరవాడలోనూ టీడీపీకి ఝలక్‌!

పరవాడ: మండల కేంద్రమైన పరవాడ గ్రామంలో టీడీపీకి చెందిన ముగ్గురు నాయకులు సుమారు 200 మంది అనుచరులతో వైఎస్సార్‌సీపీలో చేరారు. జిల్లా టీడీపీ సాంస్కృతిక విభాగం అధికార ప్రతినిధి పైల రామచంద్రరావు, తాజా మాజీ వార్డు సభ్యుడు గండి ఈశ్వరరావు, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పైల సన్యాసినాయుడు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర వైఎస్సార్‌సీపీ కార్యదర్శి పైల శ్రీనివాసరావు, ఎస్‌ఈసీ సభ్యుడు పైల సన్యాసిరాజు ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు వారు కండువాలు కప్పి ఆహ్వానించారు. టీడీపీ సిద్ధాంతాలు, విధానాలు నచ్చకే వైఎస్సార్‌సీపీలో చేరినట్లు పైల రామచంద్రరావు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి చుక్క రామునాయుడు, నాయకులు పోతల అప్పలనాయుడు, పైల హరీష్‌, గండి రామకృష్ణ, పైల వెంకటరావు, చుక్క రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement