డాబాగార్డెన్స్: జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు.నవంబర్ 1న పోలింగ్, 3న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో శుక్రవారం జీవీఎంసీ సమావేశ మందిరంలో కమిషనర్ కేతన్‌గార్గ్‌తో కలిసి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, నోడల్, సెక్టోరల్ అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు.ఓటర్ స్లిప్పుల పంపిణీ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, సిబ్బంది శిక్షణను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, హెల్ప్‌డెస్క్‌లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, వికలాంగులు, వృద్ధుల కోసం వీల్ఛైర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.సున్నిత, అత్యంత సున్నిత కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలని, అవసరమైన చోట్ల వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిబంధనల మేరకు నిర్వహించాలని తెలిపారు.కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని, 1,216 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేసి ప్రతి టేబుల్‌కు 1+3 విధానంలో సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.


