ఇంద్ర–2026 నౌకాదళ విన్యాసాలు విజయవంతం | - | Sakshi
Sakshi News home page

ఇంద్ర–2026 నౌకాదళ విన్యాసాలు విజయవంతం

Oct 24 2026 9:50 AM | Updated on Oct 24 2026 9:50 AM

సింథియా: రష్యాలోని వ్లాడివోస్టాక్‌లో నిర్వహించిన భారత్‌–రష్యా సంయుక్త నౌకాదళ విన్యాసం ఇంద్ర–2026 విజయవంతంగా ముగిసినట్లు నేవీ వర్గాలు తెలిపాయి. ఈ విన్యాసంలో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి యుద్ధనౌక పాల్గొంది. రెండు దశల్లో జరిగిన ఈ విన్యాసాల్లో భాగంగా తొలుత తీర ప్రాంత దశలో ఇరుదేశాల నౌకాదళ అధికారులు సమావేశాలు, చర్చలు, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సముద్ర దశలో నౌకల సమన్వయ కదలికలు, సమాచార మార్పిడి, హెలికాప్టర్‌ కార్యకలాపాలు, అత్యవసర వైద్య తరలింపు విన్యాసాలు చేపట్టారు. ఈ విన్యాసాలు ఇరుదేశాల నౌకాదళాల మధ్య అవగాహన, సమన్వయం, సంయుక్త కార్యకలాపాల సామర్థ్యాన్ని బలోపేతం చేశాయని నేవీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement