ఇంట్లో ఇల్లాలు.. బరిలో ప్రత్యర్థి! | - | Sakshi
Sakshi News home page

ఇంట్లో ఇల్లాలు.. బరిలో ప్రత్యర్థి!

Oct 23 2026 1:27 AM | Updated on Oct 23 2026 1:27 AM

● భార్య నామినేషన్‌ ఉపసంహరణ మరిచిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు ● 54వ వార్డులో ‘సెల్ఫ్‌ గోల్‌’తో పరశురామరాజుకు కొత్త తలనొప్పి

సాక్షి, విశాఖపట్నం: రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారివి. ఒకటికి రెండు అడుగులు ముందుగా ఆలోచించి, ఏ చిన్న రిస్క్‌ లేకుండా ‘బ్యాకప్‌’ పెట్టుకోవడం నేతలకు కొత్తేం కాదు. కానీ, ఆ బ్యాకప్‌ కాస్తా రివర్స్‌ అయితే? సరిగ్గా ఇదే సీన్‌ విశాఖ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మంతెన మురళి నాగ పరశురామరాజు గారికి ఎదురైంది. ఇప్పుడు ఈ వార్డు పాలిటిక్స్‌ టాలీవుడ్‌ సినిమాను తలపిస్తూ.. స్థానికంగా ఫుల్‌ మీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తున్నాయి.

అసలేం జరిగిందంటే..?

కూటమి పొత్తులో భాగంగా జీవీఎంసీ 54వ వార్డు బీజేపీకి కేటాయించడంతో, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు బరిలోకి దిగారు. అనుభవం ఉన్న నాయకుడే అయినా, ఎన్నికల్లో ఏమైనా తేడా కొడితే సేఫ్‌ సైడ్‌ ఉండాలని భార్య మంతెన అమృత పాలవల్లి దేవి చేత ‘డమ్మీ’ నామినేషన్‌ వేయించారు. కానీ అసలు కై ్లమాక్స్‌ అక్కడే మొదలైంది. పెళ్లి రోజు, భార్య పుట్టినరోజు మర్చిపోయే సగటు భర్తలాగే.. మన లీడర్‌గారు నామినేషన్ల ఉపసంహరణ గడువు తేదీని పూర్తిగా మర్చిపోయారు. తీరా గడువు ముగిశాక గుర్తొచ్చి ఎన్నికల అధికారుల చుట్టూ పరుగులు పెట్టినా ఫలితం లేకపోయింది. ‘నో ఛాన్స్‌.. మీ ఆవిడ కూడా బరిలో ఉన్నారు’ అని అధికారులు తేల్చి చెప్పేసరికి ఆయనకు మైండ్‌ బ్లాంక్‌ అయింది.

‘డమ్మీ’ కాస్తా.. డైరెక్ట్‌ ప్రత్యర్థి!

డమ్మీగా వేసిన ఆవిడ ఇప్పుడు తుది బరిలో ‘స్వతంత్ర’ అభ్యర్థిగా భర్తకే పోటీగా నిలిచారు. దీంతో ఆ వార్డులో ఎన్నికల పోరు కాస్తా రసవత్తరమైన ‘ఇంటి పోరు’గా మారిపోయింది. ఇప్పుడు ఈ రివర్స్‌ సీన్‌పై సోషల్‌ మీడియాలో, స్థానికంగా రకరకాల సైటెర్లు పేలుతున్నాయి. ‘పొద్దున్నే లేచి ఒకరి మొహం ఒకరు చూసుకుని ఒకే ఇంట్లోంచి ఇద్దరు అభ్యర్థులు ప్రచారానికి వెళ్తుంటే ఆ సీన్‌ చూడ్డానికి రెండు కళ్లు చాలవు‘ అని జనాలు నవ్వుకుంటున్నారు. ‘డైనింగ్‌ టేబుల్‌ దగ్గర ఎవరి ఓట్లు వాళ్లు లెక్కేసుకుంటున్నారా?‘, ‘ఏవండీ.. నా ఓట్లు మీరు లాక్కోకండి అని ఇంట్లోనే వార్నింగ్‌లు ఇచ్చుకుంటున్నారా?‘ అంటూ కూటమి నేతలు సైతం కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. భార్యని డమ్మీ అనుకుంటే పక్కలో బల్లెంలా తయారైందని సైటెర్లు వేస్తున్న స్థానికులు.. ‘సొంత భార్య వేసిన నామినేషనే వెనక్కి తీయించుకోలేని ఈ నాయకులు.. ఇక వార్డును ఏం ఉద్ధరిస్తారబ్బా!’ అంటూ ఘాటైన సైటెర్లు కూడా పేలుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement