కూటమిలో గందరగోళం | - | Sakshi
Sakshi News home page

కూటమిలో గందరగోళం

Oct 23 2026 1:27 AM | Updated on Oct 23 2026 1:27 AM

టీడీపీ, జనసేన మధ్య తేలని

జెడ్పీటీసీ సీట్ల పంపకాలు

రెండో రోజు 13 నామినేషన్లు

వైఎస్సార్‌సీపీ నుంచి ఆరుగురు అభ్యర్థులు

టీడీపీ, జనసేన నుంచి ముగ్గురు.. ఇతరులు నలుగురు

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార కూటమిలో విభేదాలు భగ్గుమంటున్నాయి. టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకాలు కొలిక్కి రాకపోవడంతో క్షేత్రస్థాయిలో నామినేషన్ల ప్రక్రియ గందరగోళంగా మారింది. జెడ్పీటీసీ స్థానాల కేటాయింపుపై ఇరు పార్టీల అధిష్ఠానాలు స్పష్టత ఇవ్వకపోవడంతో స్థానిక నాయకులు, కార్యకర్తల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. సయోధ్య కొరవడటంతో ఎవరికి వారే నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో పలు మండలాల్లో కూటమి పార్టీల శ్రేణుల మధ్య గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. క్షేత్రస్థాయిలో ఏ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారో స్పష్టత లేకపోవడంతో పొత్తు ధర్మానికి విఘాతం కలుగుతోందని కూటమి శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. అధిష్ఠానాలు త్వరితగతిన స్పందించి సీట్ల సర్దుబాటును పూర్తి చేయకపోతే ఈ విభేదాలు కూటమి విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

రెండో రోజు 13 నామినేషన్లు : రెండో రోజైన గురువారం జెడ్పీటీసీ స్థానాలకు 13 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో వైఎస్సార్‌సీపీ నుంచి ఆరు, టీడీపీ, జనసేన నుంచి మూడు, ఇతరులు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి నాలుగు నామినేషన్లు నమోదయ్యాయి. తొలిరోజు వైఎస్సార్‌సీపీ నుంచి ఒకరు, కూటమి నుంచి ఇద్దరు నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. రెండో రోజు వైఎస్సార్‌సీపీ తరఫున పెందుర్తి జెడ్పీటీసీ అభ్యర్థిగా కోడిగుడ్ల దేవీ సాంబమూర్తి, ఆనందపురం అభ్యర్థిగా గనిరెడ్డి శ్రీనివాస్‌ నామినేషన్లు దాఖలు చేశారు. భీమిలి నుంచి వెంపాడ రమావతి, వెంపాడ ఉమాదేవి, పద్మనాభం నుంచి కోరాడ మంజు, మామిడి ఆరంజ్యోతి నామినేషన్లు సమర్పించారు. కూటమి తరఫున పద్మనాభం జనసేన అభ్యర్థిగా కురిమిన మానస, పెందుర్తి టీడీపీ అభ్యర్థిగా వెన్నెల సన్యాసినాయుడు, భీమిలి జనసేన అభ్యర్థిగా పల్లా ఉమామహేశ్వరి నామినేషన్లు దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement