ఎండ.. వాన.. ఉక్కపోత! | - | Sakshi
Sakshi News home page

ఎండ.. వాన.. ఉక్కపోత!

Sep 9 2026 3:16 AM | Updated on Sep 9 2026 3:16 AM

సాక్షి, విశాఖపట్నం: సెప్టెంబర్‌ నెలలోనూ ఎండలు నడి వేసవిని తలపిస్తున్నాయి. వర్షాకాలమైనా వరుణుడు ముఖం చాటేయడంతో భానుడి భగభగలకు నగరవాసులు అల్లాడుతున్నారు. మంగళవారం సెప్టెంబర్‌లోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. 1951 నుంచి వాతావరణ గణాంకాలు పరిశీలిస్తే.. మహరాణిపేటలో నమోదైన 38.3 డిగ్రీలే అత్యధికం కావడం గమనార్హం. మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడిన నగరవాసులకు సాయంత్రం కురిసిన వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. దాదాపు 30 నిమిషాల పాటు గురుద్వారా, ఎన్‌ఏడీ, సీతమ్మధార, అక్కిరెడ్డిపాలెం, ఆరిలోవ, ఆనందపురం, గోపాలపట్నం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. అయితే వర్షం ఆగిన కొద్దిసేపటికే ఉక్కపోత మొదలవడంతో ప్రజలు మళ్లీ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వర్షపాతం వివరాలివీ...

ప్రాంతం వర్షపాతం

(మిమీల్లో)

సీతమ్మధార 15.92

అక్కిరెడ్డిపాలెం

(పెందుర్తి) 10.5

రైల్వే న్యూకాలనీ 2.0

ఆరిలోవ 1.99

రేసపువానిపాలెం 1.25

గంభీరం 0.75

మధురవాడ 0.75

హెచ్‌బీకాలనీ 0.50

ఆనందపురం 0.50

నగరంలో ఎండ తీవ్రత ఇలా..

ప్రాంతం ఉష్ణోగ్రత

(డిగ్రీల్లో)

మహరాణిపేట 38.3

ములగాడ 38.2

అక్కిరెడ్డిపాలెం

(పెందుర్తి) 37.7

పద్మనాభం 37.4

ఆనందపురం 37.2

గంగవరం 37.1

గోపాలపట్నం 36.9

ఆరిలోవ 35.6

సీతమ్మధార 35.0

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement