సింహాచలం: విద్యాప్రమాణాలు మెరుగుపరచడం ద్వారానే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచగలమని విద్యాశాఖ ఆర్‌జేడీ బి.విజయ్‌భాస్కర్, డీఈవో ఎన్.ప్రేమకుమార్ అన్నారు. అడవివరం జిల్లా పరిషత్ హైసూ్‌క్‌ల్‌లో శనివారం నిర్వహించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆర్జేడీ మాట్లాడారు. బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పిల్లలకు నైపుణ్యాలు, అభ్యసనా సామర్‌ాధ్యలు, సత్ప్రవర్తన అలవరచాలని సూచించారు.
అంతంతమాత్రంగానే ఫలితాలు
డీఈవో ప్రేమకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఎక్కువగా కల్పిస్తున్నా ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయన్నారు. విద్యార్థులకు విద్యామిత్ర పథకం ద్వారా పుస్తకాలు, యూనిఫాం వంటివి ఇస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన స్థాయిలో విద్యార్థుల చేరికలు లక్ష్యాన్ని చేరడం లేదన్నారు. ఉపాధ్యాయులు ఈ విషయంపై పునఃపరిశీలించుకోవాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఎంఈవో అనురాధ, హైస్కూల్ హెచ్‌ఎం ఇమంది పైడిరాజు, డైట్ బోధకుడు చుక్కల స్వామి పాల్గొన్నారు.


