మహారాణిపేట: నగరానికి చెందిన ఎం.వెంకటేశ్వరరావు పార్థివ దేహాన్ని ఆంధ్రా మెడికల్ కాలేజీ(ఏఎంసీ) వైద్య విద్యార్థుల పరిశోధన నిమిత్తం శనివారం ఆయన కుటుంబ సభ్యులు అప్పగించారు. మృతుడు వెంకటేశ్వరరావు కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఎం.అన్నపూర్ణ, ఇ.అభిషేక్ రావు, ఎం.కె.వి.రామారావు, ఎం.వి.లక్ష్మి, ఆర్.వంశీ, ఎం.సురేఖ వైద్య కళాశాల ఎనాటమీ డిపార్ట్‌మెంట్‌కు అందజేశారు. సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్, అఖిల భారత శరీర అవయవదాతల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నూకరాజు, స్పెక్ట్ మేనేజర్ వి.వి.ఎన్.హారిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనాటమీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ పి.సునీత, డాక్టర్ వి.రాజేష్, పీజీ విద్యార్థి డాక్టర్ జి.ఎల్.వి.ఎన్ ప్రతిమ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను నూకరాజు, హారికలు అభినందించారు.


