ఆసియా క్రీడలకు అథ్లెట్‌ జ్యోతి | - | Sakshi
Sakshi News home page

ఆసియా క్రీడలకు అథ్లెట్‌ జ్యోతి

Aug 23 2026 12:22 AM | Updated on Aug 23 2026 12:22 AM

విశాఖ స్పోర్ట్స్‌: వరల్డ్‌ అథ్లెటిక్స్‌ సిల్వర్‌ లెవెల్‌ కాంటినెంటల్‌ టూర్‌లో విశాఖ అథ్లెట్‌ జ్యోతి ఎర్రాజీ కాంస్య పతకం సాధించింది. శనివారం భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరిగిన మీట్‌లో జ్యోతి 13.24 సెకన్లలో 100 మీటర్ల హర్డిల్స్‌ పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. బహమాస్‌కు చెందిన చరిష్మా 12.96 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకం సాధించింది. భారత్‌లో నిర్వహించిన తొలి అథ్లెటిక్స్‌ కాంటినెంటల్‌ టూర్‌ సిల్వర్‌ లెవల్‌ మీట్‌ కావడం విశేషం. ఈ పోటీల్లో అంతర్జాతీయ అథ్లెట్లు పాల్గొనడంతో పాటు ప్రపంచ ర్యాంకింగ్‌ పాయింట్లు మెరుగుపరుచుకునే అవకాశం లభించింది. ఈ మీట్‌ ద్వారా జ్యోతి త్వరలో జపాన్‌లోని నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల్లో భారత్‌ తరఫున 100 మీటర్ల హర్డిల్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement