తొట్లకొండపై బ్రిక్స్ దేశాల ప్రతినిధులతో కేంద్ర మంత్రి మాండవీయ
కొమ్మాది: విశాఖ జిల్లా తొట్లకొండపై ఉన్న బౌద్ధ క్షేత్రం ప్రపంచానికి ఎంతో ముఖ్యమైందని కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవీయ అన్నారు. శనివారం ఆయన బ్రిక్స్ దేశాల ప్రతినిధులతో కలిసి తొట్లకొండలో పర్యటించారు. ఈ సందర్భంగా కొండపై మొక్కలు నాటారు. ఈ ప్రాంత విశిష్టత గురించి గైడ్ ద్వారా తెలుసుకున్నారు. బౌద్ధుల జీవన విధానం, ఆ కాలానికి సంబంధించిన పురావస్తు అవశేషాలు గురించి ప్రతినిధులు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. నీటి తొట్టెలు, ఆరామాలు, స్థూపాలు, మహాస్థూపం, పాకశాల, ధ్యాన కేంద్రాలను పరిశీలించారు. ఈ ప్రదేశాన్ని సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి మాండవీయ అన్నారు.


