బీచ్‌రోడ్డు : ఆల్ ఇండియా నం–1 మారుతి డీలర్ వరుణ్ మోటార్స్ ఆధ్వర్యంలో మారుతి కొత్త ‘బ్రెజ్జా టర్బో బూస్టర్ జెట్’ కారును ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి సింబియోసిస్ నరేష్ కుమార్, వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభు కిషోర్ మాట్లాడుతూ కొత్త బ్రెజ్జా కారును ‘స్పాంటేనియస్ ప్లే’ అనే కాన్సెప్ట్‌తో రూపొందించినట్లు తెలిపారు. ప్రతి అడుగులోనూ ఉత్సాహం, ధైర్యాన్ని కోరుకునే యువ ట్రెండ్‌సెట్టర్ల కోసం ఇది ప్రత్యేకంగా తయారైందని, దీని ప్రారంభ ధర రూ. 7,39,900 గా ఉందని అన్నారు. ఈ కారులో మెరుగుపరచిన కే15సీ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజన్‌తో పాటు, 6–స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ , స్టీరింగ్ మౌంటెడ్ ప్యాడిల్ షిఫ్టర్లతో కూడిన 6–స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో వరుణ్ మోటార్స్ జీఎం జీవీఎస్‌ఎమ్. రాజు, ఏజీఎం నవీన్ కుమార్, సంస్థ సిబ్బంది మరియు వినియోగదారులు పాల్గొన్నారు.


