మద్దిలపాలెం: వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సమన్వయకర్తలు తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, పార్టీ పర్యవేక్షకులు రవిరెడ్డి, ముఖ్యనాయకులు చింతకాయల సన్యాసి పాత్రుడు, వీసం రామకృష్ణ, పేడాడ రమణి కుమారి, కోలా గురువులు, పిన్నమరాజు సతీష్ వర్మ, బాణాల శ్రీనివాసరావు, కొండా రాజీవ్ గాంధీ, జహీర్ అహ్మద్, జియ్యాని శ్రీధర్, కట్టమూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.


