డాబాగార్డెన్స్: ద్వారకానగర్‌లోని వి స్క్వేర్ వైభవ్ జ్యూయలర్స్ మూడో అంతస్తులో ‘ది సిల్వర్ ఎడిట్’పేరిట 4 వేల కిలోల ప్రత్యేక వెండి వస్తువుల ప్రదర్శన బుధవారం ప్రారంభమైంది. ఈ నెల 26 వరకు రోజూ ఉదయం 10.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుందని సంస్థ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ రఘునాథ్.జె తెలిపారు. కంకటాల మల్లిక్ జ్యోతి ప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఇందులో వెండి పూజా సామగ్రి, సింహాసనాలు, డిన్నర్ సెట్లు, హోమ్ డెకర్, గిఫ్ట్ ఐటమ్స్, యాంటిక్ సిల్వర్ వస్తువులతో పాటు వివిధ రకాల వెండి కలెక్షన్లు ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా పాత వెండిపై కిలోకు అదనంగా రూ.2 వేల ఎక్స్చేంజ్ బోనస్, యాంటిక్ సిల్వర్‌పై 14.9 శాతం తరుగు, రెగ్యులర్ వెండి వస్తువులపై తయారీ చార్జీలు మినహాయింపు వంటి ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వారికి సిల్వర్ కాయిన్‌తో పాటు ఆకర్షణీయ బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించారు.


