సీతంపేట: సోనీ ఇండియా, బజాజ్ ఎలక్ట్రానిక్స్ సహకారంతో నూతన సోనీ బ్రావియా ట్రూ ఆర్జీబీ టెలివిజన్ శ్రేణిని విశాఖపట్నం మార్కెట్‌లో విడుదల చేసింది. నగరంలోని సోనోవిజన్ షోరూమ్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో సోనీ ఇండియా ఏపీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్–బ్రాంచ్ హెడ్ అయ్యప్పన్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ రీజినల్ మేనేజర్ శ్రీనివాస్ రూపేంద్ర, డిప్యూటీ మేనేజర్(సేల్స్) రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ట్రూ ఆర్జీబీ టీవీలు అత్యాధునిక డిస్‌ప్లే సాంకేతికతతో రూపొందించినట్లు పేర్కొన్నారు.


