కాకినాడ సమీప భూకంపానికి కారణమిదే.. | - | Sakshi
Sakshi News home page

కాకినాడ సమీప భూకంపానికి కారణమిదే..

Jul 13 2026 12:46 AM | Updated on Jul 13 2026 12:46 AM

విశాఖ విద్య: జాతీయ సముద్ర పరిశోధనా సంస్థ(ఎన్‌ఐవో) మాజీ శాస్త్రవేత్త డా.కె.ఎస్‌.ఆర్‌.మూర్తి మాట్లాడుతూ, తూర్పు తీరంలో పుదుచ్చేరి, ఒంగోలు, విజయనగరం తీర ప్రాంతాల్లో స్వల్ప భూకంపాలు సంభవించే బలహీన భూభాగాలు ఉన్నాయని తెలిపారు. వీటి తీవ్రత సాధారణంగా 4.5 కంటే తక్కువగా ఉంటుందన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశాలు కూడా తక్కువేనన్నారు. ఆదివారం నమోదైన భూకంపం సముద్రగర్భంలో, కాకినాడకు తూర్పున ఉన్న బలహీన భూభాగంలో అంతర్గత ఒత్తిడి కారణంగా సంభవించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతం గోదావరి డెల్టా సముద్ర పరిధిలోకి వస్తుందని, కచ్చితమైన కారణాలు నిర్ధారించాలంటే మరింత శాసీ్త్రయ అధ్యయనం అవసరమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement