వల్లూరుకు రావిశాస్త్రి సాహిత్య పురస్కారం | - | Sakshi
Sakshi News home page

వల్లూరుకు రావిశాస్త్రి సాహిత్య పురస్కారం

Jul 13 2026 12:40 AM | Updated on Jul 13 2026 12:40 AM

సీతంపేట: ప్రముఖ కథా, నాటక రచయిత రావిశాస్త్రి(రాచకొండ విశ్వనాథశాస్త్రి) పేరిట ప్రదానం చేసే ‘శ్రీ రావిశాస్త్రి రచనా పురస్కారం–2026’కు తెనాలికి చెందిన ప్రముఖ కథా, నాటక రచయిత వల్లూరు శివప్రసాద్‌ ఎంపికయ్యారు. ఈ నెల 30న విశాఖపట్నంలో విశాఖ రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో, డాక్టర్‌ జి.రఘురామారావు అధ్యక్షతన నిర్వహించే ప్రత్యేక సభలో ఆయనకు పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా అరసం విశాఖ జిల్లా శాఖ అధ్యక్షుడు ఉప్పల అప్పలరాజు, ఉపాధ్యక్షులు హనుమంతరావు, డాక్టర్‌ ఈశ్వరమ్మ, ప్రధాన కార్యదర్శి బసు పోతన, కార్యదర్శులు చంద్రమోహన్‌, శ్యాంసుందర్‌ తదితరులు వల్లూరు శివప్రసాద్‌కు అభినందనలు తెలిపారు. సాహిత్యంలో కథా, నాటక రచయితగా వల్లూరు శివప్రసాద్‌ విశిష్ట సేవలు అందించారని, ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేయడం సముచిత నిర్ణయమని ఉప్పల అప్పలరాజు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement