జిల్లాలో 28,983 మంది విద్యార్థులు హాజరు 133 పరీక్ష కేంద్రాల ఏర్పాటు డీఈవో ప్రేమకుమార్ వెల్లడి
ఆరిలోవ: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమకుమార్ ప్రకటించారు. శనివారం డీఈవో కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పరీక్షల షెడ్యూల్, నిబంధనలను వివరించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 456 పాఠశాలల నుంచి 28,983 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.
విభాగం విద్యార్థుల సంఖ్య
మొత్తం విద్యార్థులు 28,983
బాలురు 15,292
బాలికలు 13,691
ప్రభుత్వ పాఠశాలలు 10,050
ప్రైవేట్ పాఠశాలలు 18,933
గతంలో తప్పినవారు 1,001
బెంచీలపై హాల్ టికెట్ నంబర్లు వేస్తున్న సిబ్బంది
సీతంపేట మధురానగర్‌జీవీఎంసీ హైస్కూల్‌లో పరీక్ష కేంద్రం
విద్యార్థులకు సౌకర్యాలు
ఉచిత బస్సు ప్రయాణం: హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
హాల్ టికెట్లు: ’లీప్’ యాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటిపై ఎవరి సంతకం అవసరం లేదు.
స్క్రైబ్ సౌకర్యం: దివ్యాంగులైన 286 మంది పిల్లలకు, పరీక్షల సమయంలో ప్రమాదాలకు గురైన వారికి స్క్రైబ్‌ను ఏర్పాటు చేస్తారు.
ఆరోగ్యం– భద్రత: అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. హెల్త్ సిబ్బంది అందుబాటులో ఉంటారు.
పకడ్బందీగా పర్యవేక్షణ
పరీక్ష కేంద్రాలు : 133
సిబ్బంది : 1,634 మంది ఇన్విజిలేటర్లు, 133 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 133 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు.
ప్రత్యేక నిఘా : 5 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 9 సిట్టింగ్ స్క్వాడ్లు.
అదనపు భద్రత : 8 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి, అక్కడ సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ముఖ్య గమనిక : పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్లు అనుమతించబడవు. సీఎస్ కూడా గదుల్లోకి ఫోన్ తీసుకువెళ్లకూడదు.
ఓపెన్ టెన్త్ పరీక్షలు కూడా..
సాధారణ పరీక్షలతో పాటు సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ టెన్త్) పరీక్షలు కూడా ఈ నెల 16 నుంచి 28 వరకు జరుగుతాయి.
సమయం: ఉదయం 9.30 నుంచి 12.30 వరకు.
విద్యార్థులు: 995 మంది (11 కేంద్రాలు).
సిబ్బంది: 80 మంది ఇన్విజిలేటర్లు, 11 సీఎస్‌లు, 11 డీవోలు.
ప్రత్యేక నిఘా: 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 4 సిట్టింగ్ స్క్వాడ్లు.
పరీక్షల షెడ్యూల్
తేదీలు: ఈనెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు.
సమయం: ఉదయం 9.30 నుంచి
మధ్యాహ్నం 12.45 వరకు.
మినహాయింపు: భౌతిక, జీవ శాస్త్రం పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి 11.30 వరకు (50 మార్కులకు) జరుగుతాయి.


