పార్కింగ్?
న్యూస్‌రీల్
అక్రమ
● ఏఎల్‌ఎస్‌ఏ సంస్థ నిర్మాణాల కూల్చివేత వ్యవహారంలో ట్విస్ట్
● కాపులుప్పాడకు తరలించకుండా భీమిలి నోవాటెల్ ఎదురుగా అక్రమ డంపింగ్
● సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారం
● ఎన్‌జీటీ ఆదేశాలూ బేఖాతర్ ● చక్రం తిప్పుతున్న టీడీపీ నేత
మంగళవారం శ్రీ 20 శ్రీ జనవరి శ్రీ 2026
నోవాటెల్ ఎదురుగా డంపింగ్ చేసిన భవన నిర్మాణ వ్యర్థాలు
జేసీగా విద్యాధరి
బాధ్యతల స్వీకరణ
ప్రైవేటుకు
మహారాణిపేట : జిల్లా జాయింట్ కలెక్టర్‌గా గొబ్బిళ్ల విద్యాధరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆదివారమే నగరానికి విచ్చేసిన ఆమె కలెక్టరేట్ ప్రాంగణంలోని కార్యాలయాలను, జేసీ కార్యాలయాన్ని ముందుగా పరిశీలించారు. అందుబాటులో ఉన్న అధికారులతో మాట్లాడి జిల్లాకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాత్రి నగరంలోనే బస చేసిన ఆమె సోమవారం 12.10 గంటలకు జేసీగా తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీటింగు హాలులో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో భాగస్వామ్యమయ్యారు. కలెక్టర్‌తో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
ఒక అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తున్న జీవీఎంసీ అధికారులు మరో అక్రమ వ్యవహారానికి తెరలేపుతున్నారా? ఒకవైపు సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ఉన్నాయంటూ కూల్చివేతలు చేపడుతున్న అధికారులు.. అవే నిబంధనలకు వ్యతిరేకంగా ఒక ప్రైవేటు హోటల్‌కు పార్కింగ్ కోసం పూనుకుంటున్నారా? తమకు సీఆర్‌జెడ్ నిబంధనలైనా.. ఎన్‌జీటీ ఆదేశాలైనా బేఖాతరు అని మరోసారి అక్రమ డంపింగ్ సాక్షిగా రుజువు చేసేందుకు జీవీఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారా? అనే ప్రశ్నలకు వ్యవహారం సాగుతున్న తీరును చూస్తే అవుననే సమాధానాలే వస్తున్నాయి. మాజీ రాజ్యసభ సభ్యుడు కుమార్తె నేహారెడ్డికి చెందిన ఏఎల్‌ఎస్‌ఏ సంస్థ సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా భీమిలి తీరంలో కాంక్రీట్ నిర్మాణాలు జరిపిందన్న విమర్శల నేపథ్యంలో ఈ నిర్మాణాలను కూల్చివేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. మొదటి దశలో చేపట్టిన కూల్చివేతలపై హైకోర్టు కాస్తా సీరియస్ కావడంతో పాటు పూర్తిస్థాయిలో నిర్మాణాలను తొలగించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఇక్కడ తొలగించిన అక్రమ నిర్మాణాల శిథిలాలను కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉంటుంది. టెండర్‌లోనూ ఇదే నిబంధనను స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, ఇందుకు భిన్నంగా పక్కనే భీమిలిలోని నోవాటెల్ హోటల్‌కు ఎదురుగా డంపింగ్ చేస్తున్నారు. సదరు ప్రైవేటు హోటల్‌కు అక్రమంగా పార్కింగ్ సౌకర్యం కల్పిచేందుకే ఈ వ్యవహారం సాగుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అక్రమ పార్కింగ్ కోసమేనా..?
వైజాగ్ పర్యటనకు వచ్చిన పర్యాటకులు భీమిలి తీరాన్ని సందర్శించే వెళ్తారు. దీంతో ఈ ప్రాంతంలో సీజన్‌తో పాటు వీకెండ్‌లో పార్కింగ్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడే వరుణ్ గ్రూపునకు చెందిన నోవాటెల్ హోటల్ కూడా ఉంది. ఈ హోటల్‌కు వచ్చే అతిథులకు కూడా పార్కింగ్ సమస్య వెంటాడుతోంది. అయితే, అక్రమ నిర్మాణాలను కాంక్రీట్‌తో నిర్మించారన్న ఫిర్యాదుతో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి సంస్థకు చెందిన స్థలంలో నిర్మాణాలను తొలగిస్తున్నారు. జీవీఎంసీ టెండర్లను పిలిచి ఈ పనులను అప్పగించింది. ఈ టెండర్ నిబంధనలకు అనుగుణంగా తొలగించిన శిథిలాలను కాపులుప్పాడకు తరలించాల్సి ఉంటుంది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా కాపులుప్పాడకు తరలించకుండా భీమిలిలోని నోవాటెల్ హోటల్‌కు ఎదురుగా డంప్ చేస్తున్నారు. సదరు ప్రైవేటు హోటల్‌కు అక్రమంగా పార్కింగ్ సౌకర్యం కోసమే ఈ వ్యవహారం సాగుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమ డంపింగ్ వ్యవహారంలో తెలుగుదేశానికి చెందిన ఓ నేత కీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.
జనన రిజిస్టర్‌లో పేరు
నమోదుకు రేపే ఆఖరు
33 శాతం తక్కువకే ‘టెండర్’!
నేహారెడ్డి సంస్థకు చెందిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకుగానూ ఇప్పటికే రెండు దఫాలుగా జీవీఎంసీ పనులను చేపట్టింది. రెండో విడతలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు రూ.30 లక్షల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించింది. గత డిసెంబర్ నెల 9వ తేదీన టెండర్లను ఆహ్వానించగా.. సుహాశ్రీ కన్‌స్ట్రక్షన్స్ అనే సంస్థ ఏకంగా 37.22 శాతానికి తక్కువగా టెండర్‌ను దాఖలు చేసి పనులను దక్కించుకుంది. ఈ తక్కువకు వేయడం వెనుక ఈ తతంగం దాగి ఉందని ఇప్పుడు అర్థమవుతోంది. అంటే 30 లక్షల విలువైన పనిని కేవలం రూ.18.83 లక్షలకే చేస్తానంటూ సదరు కాంట్రాక్టరు ముందుకు వచ్చారన్నమాట. ఎందుకు ఇంత తక్కువ ధరకే కోట్ చేసి పనులను దక్కించుకున్నారంటే... తొలగించిన సదరు శిథిలాలను కాపులుప్పాడకు తరలించకుండా.. పక్కనే ఉన్న హోటల్‌కు ఎదురుగా డంపింగ్ చేస్తే సరిపోతుందన్న టీడీపీ నేత ఆదేశాలు... జీవీఎంసీ అధికారుల డైరెక్షన్‌లోనే వ్యవహారం నడిచినట్టు స్పష్టమవుతోంది. మొత్తంగా ఒక అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తూ.. మరోవైపు వరుస అక్రమాలకు పాల్పడుతున్న జీవీఎంసీ అధికారుల ధైర్యానికి మాత్రం అచ్చెరువొందాల్సిందే!
కనకమహాలక్ష్మి ఆలయంలో ప్లాస్టిక్ నిషేధం
డాబాగార్డెన్స్: పర్యావరణ పరిరక్షణ, విశ్వశాంతిని కాంక్షిస్తూ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె. శోభారాణి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, దేవదాయ శాఖ ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. అమ్మవారి అభిషేకానికి తీసుకొచ్చే పాలు, పూజా సామగ్రి విషయంలో ప్లాస్టిక్ కవర్లకు బదులుగా గుడ్డ సంచులు, స్టీల్ పాత్రలు, గ్లాస్ బాటిల్స్, మేదరి బుట్టలు వంటి ప్రత్యామ్నాయాలను వినియోగించి దేవస్థానానికి సహకరించాలని ఆమె భక్తులను కోరారు.
నిబంధనలకు విరుద్ధంగా...!
వాస్తవానికి భవన నిర్మాణ వ్యర్థాలను కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలించాలి. అలా కాకుండా ఎక్కడపడితే అక్కడ డంపింగ్ చేస్తే జీవీఎంసీ అధికారులు సదరు భవన నిర్మాణదారులకు భారీగా పెనాల్టీ విధిస్తారు. అంతేకాకుండా సదరు శిథిలాలను కాపులుప్పాడకు భవన నిర్మాణదారులు తరలించే విధంగా చర్యలు తీసుకుంటారు. అయితే, ఇక్కడ మాత్రం విచిత్రంగా సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా.. ఎన్‌జీటీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. సముద్ర తీరంలో తొలగించిన శిథిలాలను నోవాటెల్ హోటల్‌కు ఎదురుగా డంప్ చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు కూడా చేష్టలూడిగి చూడటం మినహా ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఇప్పటికీ హైకోర్టు నుంచి పదే పదే అక్షింతలు పడుతున్నప్పటికీ.. సీఆర్‌జెడ్, ఎన్‌జీటీ స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నా జీవీఎంసీ అధికారులకు మాత్రం కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంలో నిర్మాణాలను తొలగించే కాంట్రాక్టరుకు కూడా కాపులుప్పాడకు తరలించేందుకు అయ్యే ఖర్చు మిగిలిపోతుండటంతో పక్కనే హోటల్‌కు ఎదురుగా డంపింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
పార్కింగ్?


