సముద్ర భద్రత, నిఘా, సమాచార మార్పిడిలో ఉమ్మడి సమన్వయం
నగరంలో నేవీ, కోస్ట్‌గార్డ్ కీలక సమావేశం
సింథియా : తూర్పు నావికాదళం, తీరప్రాంత రక్షణ దళం మధ్య 13వ ‘కామ్నవ్‌గార్డ్’ సమావేశం సోమవారం నగరంలో ఉత్సాహంగా జరిగింది. ఈ సమావేశానికి తూర్పు నావికాదళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సుశీల్ మీనన్, కోస్ట్‌గార్డ్ అదనపు డైరెక్టర్ జనరల్ డోనీ మైఖేల్ సహ అధ్యక్షత వహించారు. సముద్ర భద్రత, నిఘా, సమాచార మార్పిడిలో ఉమ్మడి సమన్వయాన్ని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఇరు విభాగాల సీనియర్ అధికారులు కీలక చర్చలు జరిపారు. సముద్ర తీర రక్షణను బలోపేతం చేసేందుకు అవసరమైన వ్యూహాలు, పరస్పర సహకారంపై ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.


